చిన్న సినిమా ప్రచార గీతం విడుదల

చిన్న సినిమా ప్రచార గీతం విడుదల

Published on Jan 19, 2013 1:54 AM IST

chinna-cinema
చిన్న సినిమా అనే పేరుతో ఒక చిత్రం రానుంది అర్జున్ కళ్యాణ్ మరియు సుమోన చందా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కంభంపాటి దర్శకత్వం వహిస్తున్నారు శేఖర్ జ్యోతి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రచార గీతాన్ని తమ్మ రెడ్డి భరద్వాజ్ విడుదల చేశారు. ఈ చిత్రం కొత్తగా ఉండాలని ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అవ్వాలని ఆశిస్తున్నాను అని తమ్మారెడ్డి అన్నారు. ఇది పేరుకి చిన్న సినిమాయే కాని బడ్జెట్ విషయంలో ఎక్కడ వెనుకంజ వెయ్యలేదు అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్ర ఆడియో మరో వారంలో వెలువడనుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా హైదర్ బిల్గ్రామి మరియు పిజి వినద సినిమాటోగ్రఫీ అందించారు.

తాజా వార్తలు