మరో సాలిడ్ ట్రీట్ పట్టుకొస్తున్న ‘కూలీ’.. ఎప్పుడంటే?

మరో సాలిడ్ ట్రీట్ పట్టుకొస్తున్న ‘కూలీ’.. ఎప్పుడంటే?

Published on Jun 23, 2025 7:01 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై బజ్‌ను అమాంతం పెంచేసింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాలోని ‘చికిటు’ అనే సాంగ్‌కు సంబంధించిన మ్యూజిక్ వీడియోను జూన్ 25న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా పాటలు ఎలా ఉంటాయా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు