ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’లో అసుర గురువుగా ‘ఛావా’ విలన్!

మన టాలీవుడ్ టాలెంటెడ్ యువ దర్శకుల్లో తన కొన్ని సినిమాలతోనే పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని సెట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. మరి తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రాల్లో లేడీ సూపర్ హీరో చిత్రం “మహాకాళి” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయే ఖన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది వచ్చిన బాలీవుడ్ భారీ హిట్ చిత్రం ఛావా లో ఔరంగజేబుగా కనిపించిన తాను పీక్ విలనిజాన్ని చూపించారు. మరి తనపై మేకర్స్ సాలిడ్ పోస్టర్ ని ఇపుడు వదిలారు. పూర్తిగా కొత్త లుక్ లో అక్షయే దర్శనమిస్తుండగా తన అభిమానులు, హిందీ ఆడియెన్స్ తన లుక్ చూసి ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో తాను అసురులకి గురువు శుక్రాచార్యుడుగా కనిపించనున్నట్టు రివీల్ చేశారు.

మరి రీసెంట్ గా వచ్చిన మహావతార్ నరసింహ చిత్రంలో కూడా హిరణ్యాక్ష సోదరులు గురువుగా యానిమేటెడ్ వెర్షన్ ని మనం చూసాం. కానీ నిజంగా ఉంటే ఎలా ఉంటుందో ఇపుడు ప్రశాంత్ వర్మ ప్రెజెంట్ చేయడంతో ఈ పోస్టర్ పాన్ ఇండియా లెవెల్ ఆడియెన్స్ లో అటెన్షన్ ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి సమరన్ సాయి సంగీతం అందిస్తుండగా ఆర్ కే డి స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే పూజ అపర్ణ కొల్లూరు ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version