‘ఓజి’ లో కొత్త ట్రీట్ నేటి నుంచే?

OG Movie Review

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఇపుడు పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాని మొత్తం మెగా హీరోస్ స్పెషల్ స్క్రీనింగ్ లో కూడా చూడగా అభిమానులకి అది మరింత కిక్ ఇచ్చింది.

ఇక నేటి నుంచి ఓజి థియేటర్స్ లో కొత్త ట్రీట్ ఉండనున్నట్టు తెలుస్తుంది. యంగ్ బ్యూటీ నేహా శెట్టిపై ప్లాన్ చేసిన స్పెషల్ సాంగ్ ఈరోజు షోస్ నుంచే ప్రదర్శితం కానున్నట్టుగా ఇపుడు సమాచారం. నిజానికి నిన్న సోమవారం నుంచే అనుకున్నారు కానీ క్యూబ్ లో కంటెంట్ అప్ లోడ్ చేయడం కొంచెం ఆలస్యం అయ్యేసరికి మాత్రం అది ఇవాళ్టి షోస్ నుంచి అందుబాటులో ఉంటుందట. సో నేటి షోస్ నుంచి ఓజి థియేటర్స్ లో కొత్త ట్రీట్ ఉండొచ్చు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version