ఫోటో మూమెంట్: ‘ఓజి’ స్పెషల్ స్క్రీనింగ్ లో చిరు, పవన్, రామ్ చరణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం ఓజి కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చి ఇప్పుడు 250 కోట్లకు పైగా గ్రాస్ ని ఈ చిత్రం దాటింది. ఇక ఈ సినిమాకి ఎప్పుడూ లేనిది వసూళ్లు కూడా పవన్ నుంచి అనౌన్స్ కావడం విశేషం.

ఇక ఈ సినిమాని మెగాస్టార్ అండ్ ఫ్యామిలీ వీక్షించడం క్రేజీగా మారింది. హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్స్ లో మెగాస్టార్ చిరంజీవి, మెగపవర్ స్టార్ రామ్ చరణ్, అలాగే పవన్ కళ్యాణ్ ఇంకా సుజీత్, థమన్,నిర్మాత దానయ్య అలాగే సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ సహా ఇతర ముఖ్యులు ఈ సినిమాని వీక్షించడం విశేషం. దీంతో స్క్రీన్ లో వీరిపై ఆ క్లిక్ మంచి ఫోటో మూమెంట్ గా మారింది.అలాగే ఈ పిక్ చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version