యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ప్రతిఘటన

యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ప్రతిఘటన

Published on Jul 28, 2013 4:06 AM IST

Charmi--(2)

త్వరలో ఛార్మీ ప్రధానపాత్రలో ” ప్రతిఘటన” అనే సినిమాలో కనిపించనుంది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమాకు దర్శకత్వ మరియు నిర్మాణ భాద్యతలు వహించనున్నారు. ఈ సినిమా ఒక యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఒరిస్సాలో బలాత్కారానికి గురై కోమాలోకి వెళ్ళిపోయిన ఒక యువతి జీవితాన్ని చూసి తీస్తున చిత్రం. రోజూ ఇటువంటి సంఘటనలు వార్తాపత్రికలలో చదివి విసిగిపోయి మనసులోంచి వచ్చిన ఆవేదన్, ఆవేశానికి చిత్రరూపమే ఈ ‘ప్రతిఘటన’ అని తెలిపారు. చార్మీ ఈ సినిమాలో నిశ్చల అనే ఒక టి.వి జర్నలిస్ట్ పాత్రను తన కెరీర్ లోనే ఛాలెంజింగ్ రోల్ గా భావించి పోషించనుంది. లక్ష్మి భూపాల్ స్క్రిప్ట్ ను అందించాడు. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. రాజకీయాల నడుమ సాగే ఈ సినిమాలో అతుల్ కులకర్ణి ఒక ముఖ్యమైన సన్నివేశంలో కనిపిస్తాడు. చాలారోజుల తరువాత సినిమాను తీస్తున్నతమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఈ సినిమా కీలకం అనే చెప్పాలి. ఒక మంచి విషయం సూటిగా చెప్పాలనే ఆశయంతో మన దర్శకనిర్మాత చాలా కృతనిశ్చయుడై ఉన్నాడనే చెప్పాలి

తాజా వార్తలు