చరణ్ తో స్టెప్స్ ఏసిన చార్మీ

nayak-charme
రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “నాయక్” ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రంలో జస్ప్రీత్ మరియు సుచిత్ర పాడిన “ఎవ్వారమంటే నెల్లూరు” పాట చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ పాటలో రామ్ చరణ్ సరసన చార్మీ డాన్స్ చేస్తున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా చార్మీ ట్విట్టర్లో తెలిపారు. కాజల్ ,అమలా పాల్ కథానాయికగా నటించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించగా డి వి వి దానయ్య నిర్మించారు. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 9,2013న విడుదల చెయ్యనున్నారు.

Exit mobile version