పూరి గురించి ఛార్మి చెప్పిన ఆసక్తికర సంగతులు..!

దర్శకుడు పూరి జగన్నాధ్ ఇస్మార్ శంకర్ మూవీతో ఒక్కసారిగా సూపర్ ఫార్మ్ లోకి వచ్చాడు. ఆ మూవీ విజయంతో పూరి ఈజ్ బ్యాక్ అంటున్నారు అందరూ. రామ్ హీరోగా తెరకెక్కిన ఊర మాస్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ వరల్డ్ వైడ్ గా 75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. ఇక ఈ మూవీ నాకు ఊపిరి పోసిందని పూరి కూడా స్వయంగా చెప్పాడం జరిగింది. ఈ మూవీ నిర్మాతగా ఉన్న ఛార్మి ప్రస్తుతం చేస్తున్న మూవీ విశేషాలతో పాటు, పూరి గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

గత నాలుగు నెలలుగా పూరి కొత్త కథలు రాయడంలో తలమునకలై ఉన్నారట. అలాగే ఇకపై పూరి నుండి వచ్చేవన్నీ పాన్ ఇండియా చిత్రాలే అని ఆమె చెప్పడం విశేషం. పూరి సినిమాలు ఇకపై ఆయన ఫ్యాన్స్ ఆకలి తీర్చేవిగా ఉంటాయట. కాగా విజయ్ దేవరకొండతో పూరి చేస్తున్న మూవీ టైటిల్ ఇంకా నిర్ణయయించలేదు అన్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషలకు సరిపోయేలా ఓ టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట.

Exit mobile version