జర్నలిస్టుగా మారిన ఛార్మీ

charmii

ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ్ చాలాకాలం విరామం తరువాత ఒక సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఆయన పోతే పోనీ’, ‘స్వర్ణముఖి’, ‘ఎంతబాగుందో’ వంటి పలు చిత్రాలు తీసారు. అంతేకాక చాలా సినిమాలను నిర్మించారు. ప్రాస్తుతం ఛార్మీ ప్రధానపాత్రలో ”
ప్రతిఘటన” అనే సినిమాను తీస్తున్నారు. సమాచారం ప్రకారం ఛార్మీ ఈ సినిమాలో పత్రికావిలేఖరిగా కనిపించనుంది. రాజకీయ నేపధ్యంలో తీస్తున్న చిత్రమైనప్పటికీ ఎవ్వరినీ నొప్పించకుండా వుంటుందంట. ఇప్పటికే ‘మంత్ర’, ‘మంగళ’, ‘ప్రేమ ఒక మైకం’, ‘అనుకోకుండా ఒక రోజు’ సినిమాలలో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలను చేసిన ఛార్మీకు ఈ ‘ప్రతిఘటన’ తన కీర్తికిరీటంలో నిలిచిపోనుందట. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

Exit mobile version