సరదాగా అమ్మాయితో సినిమాలో సరదాగా మెరవనున్న చార్మీ

సరదాగా అమ్మాయితో సినిమాలో సరదాగా మెరవనున్న చార్మీ

Published on May 7, 2013 8:30 PM IST

Charmi-New-Stills
వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘సరదాగా అమ్మాయితో’ సినిమా విడుదలకు సిద్దంగావుంది. ఇందులో చార్మీ ఒక ముఖ్య పాత్ర చేసింది. ఈ పాత్ర సినిమా ద్వితీయార్ధంలో వస్తుంది. తన పాత్ర గురించి మాట్లాడుతూ “నేను ఇప్పటివరకూ అతిధి పాత్రలు పోషించలేదు. తదుపరి సినిమాలలో కుడా పోషించను. నేను ముందుగా ఈ పాత్రను అంగీకరించాలేకపోయాను. కానీ నిర్మాత, దర్శకుడు పట్టుబట్టి మరీ నన్ను ఒప్పించారు. ఇందులో నా పాత్ర చిన్నదే అయినా చాలా ఉత్సాహంగా సాగుతుంది. నా పాత్ర సినిమాకు మార్పు తెస్తుందని భావిస్తున్నానని”అన్నారు. భాను శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పత్తికొండ కుమారస్వామి నిర్మాత. రవి వర్మ సంగీతం అందించాడు.

తాజా వార్తలు