ఆగష్టు 2వ వారంలో విడుదలకానున్న తుఫాన్ ఆడియో?

ఆగష్టు 2వ వారంలో విడుదలకానున్న తుఫాన్ ఆడియో?

Published on Jul 23, 2013 8:19 PM IST

Thoofan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘జంజీర్’ సినిమా సెప్టెంబర్లో భారీ విడుదలకు సిద్ధంగావుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘తుఫాన్’ గా మనముందుకు రానుంది. సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదల ఆగష్టు 2వ వారంలో వుండచ్చు. ఈ వార్తను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సివుంది.

ఈ చిత్రానికి అపూర్వ లిఖియా దర్శకుడు. తెలుగు వెర్షన్ యోగి పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ సినిమా అమితాబ్ బచ్చన్ ను యాంగ్రీ యంగ్ పోలీస్ ఆఫీసర్ గా చూపించిన ‘జంజీర్’ కు రీమేక్

చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఈ నెల 31న విడుదలకు సిద్ధంగావుంది. ఆ తరువాత కేవలం 40 రోజుల వ్యవధిలో ‘తుఫాన్/జంజీర్’ విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు