లీక్ అయిన పాటలో చరణ్ డాన్స్ సూపర్

Naayak
తెలుగు పరిశ్రమలో చెప్పుకోదగ్గ డాన్సర్స్ లో రామ్ చరణ్ ఒకరు ఇదే విషయాన్నీ అయన మరోసారి నిరూపించుకున్నారు. అయన రాబోతున్న చిత్రం “నాయక్” ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతుంది కొద్ది రోజుల క్రితం ఈ చిత్రంలోని “లైలా ఓ లైలా” పాట ఇంటర్నెట్లోకి లీక్ అయ్యింది. శరవేగంగా అభిమానుల్లోకి వెళ్ళిన ఈ పాటలో చరణ్ డాన్స్ అందరిని ఆకట్టుకుంది. ప్రత్యేకంగా అయన చేసిన లెగ్ మూవ్ మెంట్స్ అయితే సూపర్బ్ అని చెప్పాల్సిందే. ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు కాజల్ అగర్వాల్ మరియు అమల పాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. వి వి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా డి వి వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అభిమానులకు ఈ చిత్రం కన్నుల పండుగ కానుంది అనడానికి చరణ్ డాన్స్ సంకేతం అనుకోవచ్చు.

Exit mobile version