పతాక సన్నివేశాల్లో ‘నాయక్’

పతాక సన్నివేశాల్లో ‘నాయక్’

Published on Dec 7, 2012 9:44 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘నాయక్’ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమాని జనవరి 9న భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు, మిగిలిన షూటింగ్ మొత్తం కొన్ని వారాల క్రితమే పూర్తయ్యింది. చరణ్ , కాజల్ అగర్వాల్, అమలా పాల్ తో పాటు మిగతా ప్రముఖ తారాగణం కూడా క్లైమాక్స్ సీన్స్ షూటింగ్లో పాల్గొంటున్నారు.

వి.వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో డిసెంబర్ 14న హైదరాబాద్లో జరగనుంది. ‘నాయక్’ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని అంచనా వేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు