చరణ్ అంకితభావం చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు ఉంది: చిరంజీవి


మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. రామ్ చరణ్ తను నటిస్తున్న రచ్చ చిత్ర షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. పాట చిత్రీకరణ సమయంలో చరణ్ గాయపడ్డాడు అని నిర్మాత కంగారు పడ్డారు. కాని తనకు ఏమీ కాలేదు త్వరలోనే మళ్లీ షూటింగ్లో పాల్గొంటాను అంటూ చరణ్ చిత్ర నిర్మాతకి భరోసా ఇచ్చాడు. ఈ అంకిత భావం ఇండస్ట్రీకి ‘శ్రీ రామ రక్ష’ లాంటిది. గోవాలో షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగినపుడు కూడా ఏ మాత్రం భయపడకుండా మళ్లీ షూటింగ్లో పాల్గొన్నాడు. చరణ్ అంకితభావం చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు ఉంది అని చిరంజీవి నిన్న జరిగిన రచ్చ ఆడియో వేడుకలో అన్నారు.

Exit mobile version