ఆర్ ఆర్ ఆర్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ నేడు ఫ్యాన్స్ కి సోషల్ మీడియా ద్వారా ఓ సందేశం పంపారు. ఈనెల 27న జరగాల్సిన తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించరాదని విన్నవించడం జరిగింది. ఊహకు మించిన స్థాయిలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో దానిని అరికట్టెలో క్రమంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఆయన ఫ్యాన్స్ తో పాటు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బాధపడే ఓ విషయం దాగివుంది. అదేమిటంటే ఆర్ ఆర్ ఆర్ నుండి ఈనెల 27న ఎటువంటి అప్డేట్ ఉండకపోవచ్చు.
ఆర్ ఆర్ ఆర్ నుండి రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఎదో ఒక కీలక అప్డేట్ ఉంటుందని చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశించారు. అల్లూరిగా చరణ్ ని పరిచయం చేస్తారు అని చరణ్ ఫ్యాన్స్ ఆశపడగా, టైటిల్ లేదా మరో కీలక అప్డేట్ ఇచ్చే అవకాశం కలదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఐతే అనూహ్యంగా చరణ్ కరోనా కారణంగా పుట్టిన రోజు వేడుకలు రద్దు చేసుకున్న క్రమంలో ఆర్ ఆర్ ఆర్ నుండి ఊహించిన స్థాయి అప్డేట్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఆర్ ఆర్ ఆర్ నుండి చరణ్ కి జస్ట్ బర్త్ డే విశెస్ చెవుతూ ఫోటో విడుదల చేస్తారు అనిపిస్తుంది.