మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వివి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 8 లోని పలతియాల్ బంగ్లాలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. రామ్ చరణ్, రాహుల్ దేవ్, రఘు బాబు మొదలగు వారి పై ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాజల్ అమలా పాల్ కథానాయికలలుగా నటిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. మాస్ మసాల ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. చరణ్, తమన్ కాంబినేషన్లో వస్తున్న మొట్ట మొదటి చిత్రం ఇదే. చరణ్, కాజల్ గతంలో మగధీర వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో కలిసి నటించారు.