మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తను నటిస్తున్న ‘రచ్చ’ చిత్రం కోసం డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టూడియోలో జరుగుతున్నాయి. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైట్ మిల్క్ బ్యూటీ తమన్నా హీరొయిన్ గా నటిస్తుంది. రచ్చ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు.