మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆదివారం ‘నాయక్’ సినిమా విజయయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ఏరియాల్లో పయనించారు. రామ్ చరణ్ కి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్లోని కొన్ని థియేటర్లకు వెళ్ళిన రామ్ చరణ్ కి అన్ని దగ్గర్లా ఫాన్స్ బ్రహ్మరధం పట్టారు. చరణ్ ఎంతో ఉత్సాహంతో, జోక్స్ వేస్తూ ఫాన్స్ తో ముచ్చటించారు. అలాగే ఇకనుంచి చరణ్ నుంచి మాస్ మసాల ఎంటర్టైనర్ సినిమాలు ఫాన్స్ ఆశించవచ్చని అన్నాడు.
సంక్రాంతి హాలిడేస్ సందర్భంగా నాయక్’ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. ఈ సినిమా 40 కోట్ల కలెక్షన్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి వి.వి వినాయక్ డైరెక్టర్. దానయ్య నిర్మించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.