‘మహర్షి’తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వంశీ పైడిపల్లికి తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి చరణ్ కి స్క్రిప్ట్ వినిపించాడని.. చరణ్ కూడా కథ విని బాగుందని చెప్పినట్లు సమాచారం. ఈ సినిమా పూర్తిస్థాయి ఎమోషనల్ యాక్షన్ చిత్రంగా ఉండబోతోందట.
ముఖ్యంగా ఓ క్రేజీ పాయింట్ సినిమాలో ఉంటుందని.. పూర్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతోందని.. ముఖ్యంగా చరణ్ కి ఇది మరో పాన్ ఇండియా మూవీలా వంశీ పైడిపల్లి ఈ సినిమాని రూపొందించే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తోంది. మహర్షి తరువాత వంశీ చేస్తున్న సినిమా కావడం, అటు చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ తరువాత చేసే సినిమా కావడంతో.. ఈ సినిమా భారీ అంచనాలు ఉంటాయి.