‘సాహసం’ ఆడియోని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్న చంద్రశేఖర్ యేలేటి

Sahasam Audio Launch

‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’, ‘ఒక్కడున్నాడు’, ఇలా డిఫరెంట్ స్టైల్ లో సినిమాని తెరకెక్కించిన దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి. ఈయన చివరి సినిమా ‘ప్రయాణం’ ఇది నాలుగు సంవత్సరాల క్రితం విడుదలైంది. ఈ సినిమాని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరు తీయని విదంగా డిఫరెంట్ గా సినిమా మొత్తం ఎయిర్ పోర్ట్ లోనే తీశారు. ప్రస్తుతం తను తీస్తున్న సినిమా ‘సాహసం’. యాక్షన్ అడ్వంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తాప్సీ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. చంద్ర శేఖర్ యేలేటి ఈ సినిమా ఆడియో డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వంచర్ లో పాటలు స్పీడ్ బ్రేకర్స్ ల ఉండరాదని భావించిన ఆయన గోపిచాంద్, తాప్సీ లపై తాజాగా మరో పాటని షూట్ చేశారని సమాచారం. ఈ సినిమాలో కథకు సంబందించిన మరో రెండు పాటలు కూడా ఉండనున్నాయి. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అవుతుందని వారు అన్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాని జూన్ 24 నవిడుదలకు సిద్దమవుతోంది.

Exit mobile version