నటీనటులు గుణ్ణం గంగరాజు ‘చందమామ లో అమృతం ‘ చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశ లో వున్న ఈ చిత్రం మొదటి కాపీ కొన్ని రోజుల్లో తయారు కానుంది. ఈ చిత్రం 2001 నుంచి 2007 వరకు ప్రసారామయిన ప్రముఖ ధరావాహిక ‘అమృతం’ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. శ్రీనివాస్ అవసరాల , హరీష్ కోయలగుండ్ల, ధన్య బాలకృష్ణన్, ఇంటూరి వాసు, శివన్నారాయణ మరియు సుచిత్ర ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్ర చిత్రీకరణ గురించి మాట్లాడుతూ, నటీనటులు ఈ చిత్రం షూటింగ్ చాలా మంచి అనుభవం అని తెలిపారు. ఈ చిత్రం చాలా భాగం భూమి మిదే నడిచినా, కొంత భాగం మాత్రం స్పేస్ లో మరియు చందమామ మీద జరుగుతుంది. ఈ సన్నివేశాలు చిత్రీకరించడానికి నటీనటులు స్పేస్ సూట్స్ మాత్రమే ధరించాలి. కొంత సేపటి తర్వాత ఇతరులు డైలాగు చెప్పింది లేనిదీ అర్ధం అవ్వకపోవడం తో కొన్ని సిగ్నల్స్ ద్వార డైలాగు లు చెప్పేవారు. అంతే కాకుండా, గాలి ఆడడం కోసం హెల్మెట్ లకి లాప్టాప్ ఫాన్స్ పెట్టేవారు.
జస్ట్ యెల్లో మీడియా పై నిర్మింపబడిన ఈ చిత్రానికి శ్రీ సంగీత దర్శకత్వం వహించారు . ”చందమామ లో అమృతం” భారత దేశం లోనే మొట్ట మొదటి స్పేస్ కామెడీ చిత్రం గా పెర్కోనబడుతుంది .