ఆ కామెడీ మూవీలో 64 నిమిషాలు విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట.!

ఆ కామెడీ మూవీలో 64 నిమిషాలు విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట.!

Published on Jul 28, 2013 7:00 PM IST

Chandamama-lo-Amrutham
గుణ్ణం గంగరాజు తెరకెక్కిస్తున్న ‘చందమామలో అమృతం’ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని సమాచారం. ఈ సినిమా సూపర్ హిట్ అయిన టీవీ సీరియల్ అమృతం నుంచి స్పూర్తిగా తీసుకొని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, హరీష్, వాసు ఇంటూరి, ధన్యలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో చాలా భాగం స్పేస్ లో జరుగుతుంది దాని కోసం చందమామ ఉండే ఓ సెట్ ని వేసారు. ‘ స్పేస్ లోకి వెళ్ళే వ్యోమగాములువేసుకునే డ్రెస్ ని నటీనటులు వేసుకోవడం చాలా కష్టం. ఆ డ్రెస్ సూట్ ని మొయ్యడం చాలా కష్టం, అలాగే వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉండదు ఏదైనా కేవలం సైగలతోనే చెప్పుకోవాలి. ఈ సినిమా క్లైమాక్స్ లో ఒకే సీన్ లో 20 మందికి పైగా నటీనటుల్ని స్క్రీన్ పైకి తీసుకు రావడం చాలా కష్టమైన పనని’ గుణ్ణం గంగరాజు అన్నారు.

ఈ సినిమా షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన సౌండ్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో 64 నిమిషాలు విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని సమాచారం. డైరెక్టర్ ఆ కార్యక్రమాలన్నీ పూర్తవడానికి మరో మూడు నెలలు టైం పడుతుందని తెలిపారు. మొదటి సారి గుణ్ణం గంగరాజు ఈ స్థాయిలో విఎఫ్ఎక్స్ వాడుతున్నారు కానీ ఈ సినిమా ప్రేక్షకులని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుందని మాత్రం చెప్పొచ్చు.

తాజా వార్తలు