ఫిబ్రవరి 28న చందమామ కధలు ఆడియో చందమామ కధలు

Chandamama-Kathalu

ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన చందమామ కధలు సినిమా శిల్పారామం దగ్గర రాక్ హైట్స్ లో ఈ నెల 28న ఘనంగా జరగనుంది. మంచు లక్ష్మి, కృష్ణుడు, చైతన్య కృష్ణ, సాయి కుమార్, నరేశ్, సౌమ్య ఆమని మరియు నాగ శౌరి ప్రాధాన పాత్రధారులు. ఈ సినిమా రియాలిటీ నుండి తెరకెక్కించిన 8 విభిన్నకధాంశాల మిశ్రమం

ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “ఈ సినిమా మూల కధ సారధి అనే రచయత మరియు అతని 8ఏళ్ళ అమ్మాయి గురించి. సారధి ఒక జాతీయ అవార్డు గ్రహిత రచనలు చేస్తూ 8ఏళ్ళ పాపను ఒంటరిగా పెంచుతూవుంటాడు. ఆమె పేరు కావ్య. సారధి కష్టాలు, ఆనందాలు, ఒడిదుడుకులు చూపించాం. మిగిలిన 7కధలు సారధి ఊహాజనితాలు. తన జీవతంలో అర్ధంచేసుకున్న దానికి రూపకల్పనే ఈ 7 కధలు” అని తెలిపాడు. హ్యాపీ, దళం వంటి సినిమాలు చేసిన కిషోర్ ఈ సారధి పాత్రను పోషించాడు

మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు. చాణుక్య ఈ సినిమాను వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో మనముందుకు రానుంది

Exit mobile version