కాళిచరణ్ సినిమా కోసం 7 సినిమాలు వదిలేసుకున్న చైతన్య కృష్ణ

కాళిచరణ్ సినిమా కోసం 7 సినిమాలు వదిలేసుకున్న చైతన్య కృష్ణ

Published on May 7, 2013 8:45 PM IST

chaitanya-krishna-b-copy
తాను మనసార నమ్మిన ఒక సినిమా చెయ్యడం కోసం ఒక నటుడు ఎన్ని త్యాగాలైనా చేస్తాడు… ఈ త్యాగాలు ఎలా వుంటాయంటే కొన్ని సార్లు చేతికందిన సినిమాలని సైతం వదులుకోవలసి వస్తుంది. చైతన్య కృష్ణ తను నటిస్తున్న ‘కాళిచరణ్’ కోసం ఇలాంటి త్యాగమే చేసాడు. శ్రీ పవన్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకోసం చైతన్య కృష్ణ దాదాపు ‘కాళీచరణ్ ‘ కోసం 7 సినిమాలు వదిలేసుకున్నాడట.దర్శకుడు అడిగిన విధంగా జుట్టూ,గడ్డం పెంచుకోవడానికి 10 నెలలు పట్టిందట.

“నన్ను తెర మీద చూపించడానికి శ్రీ పవన్ తీసుకున్న జాగ్రత్త నన్ను ఆశ్చర్యపరిచింది. పొడవైన జుట్టు కోసం చాలా కష్టపడ్డాను. కేవలం నా జుట్టును పరీక్షించడానికే డైరెక్టర్ కొన్ని కొన్ని సార్లు వాళ్ళ ఆఫీస్ కు పిలిచేవారని”చైతన్య కృష్ణ చెప్పాడు. ఈ సినిమాలో చాందిని, పంకజ్ కేసరి, కవిత శ్రీనివాసన్ నటిస్తున్నారు. నందన్ రాజ్ సంగీతం అందించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఈ నెలాఖరున విడుదలకావచ్చు.

తాజా వార్తలు