యాక్షన్ ఎడ్వెంచర్ లో కేథరీన్

యాక్షన్ ఎడ్వెంచర్ లో కేథరీన్

Published on Jan 15, 2014 2:10 AM IST

catherine_theresa
అల్లు అర్జున్ సరసన ఇద్ధరమ్మాయిలతో సినిమాలో నటించినా కేథరీన్ కు అంతగా నటించే అదృష్టం రాలేదనే చెప్పాలి. ఆమె నటించిన ‘పైసా’ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. అయితే ఆమె ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై దృష్టిపెట్టనుంది

ఈ భామ చేతిలో ప్రస్తుతం రెండు తమిళ ప్రాజెక్టులు వున్నాయి. అందులో ఒకటి అథర్వ తో కలిసి నటిస్తుంది. శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ యాక్షన్ ఎడ్వెంచర్ నేపధ్యంలో సాగనుంది. ఈ సినిమాకు ‘గణితన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. డ్రమ్స్ శివమణి సంగీతదర్శకుడు. టి.ఎన్ సంతోష్ దర్శకుడు. కలైపులి ఎస్ ధను నిర్మాత

ఈ సినిమానే కాక కార్తీ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాక గుణశేఖర్ రుద్రమదేవి 3డి లో యువరాణి పాత్ర పోషిస్తుంది

తాజా వార్తలు