యంగ్ హీరో నవదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ వసూల్ రాజా’. కార్తికేయ గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన ‘ఆహ నా పెళ్ళంట’ సినిమాలో నటించిన రీతు బర్మేచా కథానాయికగా నటిస్తోంది. డబ్బు అంతా డబ్బే అన్న థీంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇందులో హీరోకి కుప్పలు కుప్పలుగా వచ్చి పడే డబ్బుని ఎలా సంపాదిస్తున్నాడా? ఇంతకీ అతను దాదానా? లేక అతను అక్రమంగా సంపాదిస్తున్నాడా? అనేది తెరపైనే చూడాలి. ఈ సినిమా వినోదాత్మకంగా సాగుతుందని’ ఆయన అన్నారు.
ఈ చిత్రంలో రియల్ స్టార్ శ్రీ హరి మరియు బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి చిన్ని చరణ్ సగీతం అందిస్తున్నారు. బత్తుల రతన్ పండు మరియు మహంకాళి దివాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.