కరోనా కారణంగా యంగ్ హీరో ప్లాన్ డిస్టర్బ్ అయింది

కరోనా కారణంగా యంగ్ హీరో ప్లాన్ డిస్టర్బ్ అయింది

Published on Mar 15, 2020 7:37 PM IST

‘గూఢచారి, ఎవరు’ లాంటి థ్రిల్లింగ్ హిట్స్ తర్వాత ఆ తరహాలోనే అడివి శేష్ చేస్తున్న చిత్రం ‘మేజర్’. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన ఎన్.ఎస్.జి కమెండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ సినిమాను చ సూపర్ స్టార్ మహేష్ బాబు సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి స్వయంగా నిర్మిస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం సినిమా నుండి ఇక వరుస అప్డేట్స్ వస్తాయని టీమ్ తెలిపారు.

అందులో భాగంగానే ఈరోజు ఉన్నికృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా అడివి శేష్ సప్రైజింగ్ అప్డేట్ ప్లాన్ చేశారు. కానీ కరోనా వైరస్ కారణంగా ప్లాన్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యాయని, అందుకే ఆ అప్డేట్ విడుదలను వాయిదా వేస్తున్నామని, పరిస్థితులు చక్కబడ్డాక అప్డేట్ విడుదలను నిర్ణయిస్తామని అన్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘గూఢచారి’ దర్శకుడు శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్నాడు.

తాజా వార్తలు