అల్లు అర్జున్ రికార్డును మహేష్ బద్దలు కొడతాడా..?

టాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఒకరి రికార్డును మరొకరు బద్ధలుకొట్టడం కామన్. అయితే, సోషల్ మీడియాలో కూడా కొన్ని రికార్డులు స్టార్ హీరోల పేరిట ఉన్నాయి. అలాంటి వాటిలో ఎక్స్(గతంలో ట్విట్టర్)లో ఓ తెలుగు సినిమా ప్రమోషనల్ పోస్ట్ సాధించిన రికార్డును ఏ హీరో కూడా బీట్ చేయలేకపోయారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్విట్టర్‌లో మాసివ్ రికార్డు ఉంది. ఆ ప్రమోషనల్ పోస్ట్‌కు ట్విట్టర్ హ్యాండిల్‌లో ఏకంగా 285వేల లైకులు, 14 మిలియన్ ఇంప్రెషన్‌లు దక్కాయి. దీంతో ఇప్పటివరకు తెలుగులో అత్యధిక రీచ్ కలిగిన పోస్ట్‌గా ‘పుష్ప-2’ నిలిచింది.

ఇక ఇప్పుడు ఈ రికార్డును బద్దలుకొట్టే అవకాశం సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాత్రమే ఉందని సినీ సర్కిల్స్ టాక్. దర్శకుడు రాజమౌళితో మహేష్ చేస్తున్న మోస్ట్ హైప్ ఉన్న సినిమా నుంచి నవంబర్‌లో ఓ సాలిడ్ ట్రీట్ రానుంది. ఒకవేళ ఎవరి ఊహలకు అందని విధంగా రాజమౌళి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేస్తే, ‘పుష్ప-2’ రికార్డును బద్దలుకొట్టడం ఖాయం. మరి ఈ విషయంలో బన్నీ రికార్డును మహేష్ బీట్ చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version