ఓటిటి సమీక్ష: ‘కాలింగ్ బెల్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘కాలింగ్ బెల్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Published on May 19, 2025 11:44 PM IST

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మే 18, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్‌

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : శ్రీనివాస్ వడ్లమని, అరుణ్ దేవ్, సాగర్, రాజ్ కుమార్, తదితరులు
దర్శకులు : శ్రీకాంత్ దేవరకొండ
నిర్మాతలు : ఈనాడు ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం : హర్ష
సినిమాటోగ్రఫీ : మౌర్య
ఎడిటింగ్ : శివ

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మన తెలుగు ఓటిటి పాపులర్ స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన లేటెస్ట్ ఎపిసోడ్ నే ‘కాలింగ్ బెల్’. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

మనుషులకి కొంచెం దూరంగా ఉంటూ వారితో మాట్లాడాలన్నా కూడా చిరాకు గానే ఉండే పెద్ద మనిషి ఆది నారాయణరావు (శ్రీనివాస్ వడ్లమని) తన ఇంటికి తరచుగా వచ్చే మనుషులు వారు కొట్టే కాలింగ్ బెల్ తో విసిగెత్తిపోయి ఇంటికి ఉన్న కాలింగ్ బెల్ ని తీసేస్తాడు. అయితే రోజు అక్కడ పక్కనే ఉండే పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటే బాల్ తన ఇంటి ఆవరణలో పడుతుంది. అందులో చిన్ను (అరుణ్ దేవ్) ఆ బాల్ కోసం వెళ్లిన తర్వాత నుంచి చిన్న పిల్లాడైన చిన్నూకి తన తాత వయసున్న ఆది నారాయణకు నడుమ గొడవ నుంచి మొదలైన పరిచయం స్నేహంగా ఎలా మారింది? ఆది నారాయణ ఎందుకు అలా ఉంటున్నారు? తన గతం ఏంటి? చిన్నూకి ఏమైంది.? తన కోసం ఆది నారాయణ ఏం చేశారు అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈటీవీ విన్ ప్రసారం అవుతున్న ఈ వీక్లీ సిరీస్ లో వచ్చిన మరో డీసెంట్ ఎపిసోడ్ ఇది అని చెప్పవచ్చు. పెద్ద వాళ్ళు చిన్న పిల్లల నడుమ జరిగే సంభాషణలు ఆసక్తిగా తెరకెక్కించాలి గాని అవి చూసేందుకు ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి.

మరి అదే తరహా డీసెంట్ ఎంటర్టైన్మెంట్ ఈ ఎపిసోడ్ లో వీక్షకులకు దక్కుతుంది. నటుడు శ్రీనివాస్, మాస్టర్ అరుణ్ దేవ్ నడుమ పలు సన్నివేశాలు మంచి అర్ధవంతంగా అనిపిస్తాయి. ఇద్దరి నడుమ గొడవలు, తర్వాత స్నేహం ఈ సన్నివేశాలు బాగున్నాయి.

అలాగే నటన పరంగా కూడా వీరు చక్కగా చేశారు. 35 చిన్న కథ కాదులో షైన్ అయ్యిన బాల నటుడు అరుణ్ దేవ్ ఈ లఘు చిత్రంలో కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా చేసాడని చెప్పొచ్చు. అలాగే వీరి నడుమ ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ లఘు చిత్రంలో కోర్ లైన్ ఎక్కడో కొంచెం వీక్ గా అనిపిస్తుంది. అల్లుకున్న కథనం బాగానే ఉంది కానీ ఆ కాలింగ్ బెల్ కాన్సెప్ట్ గా ఇంకొంచెం బలంగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. కాలింగ్ బెల్ కొట్టేది కేవలం పరిచయం కోసమే కాదు మనతో ఉండడానికి కూడా కావచ్చు అనే పాయింట్ అంత బలంగా ప్రెజెంట్ చేసినట్టు అనిపించలేదు.

అలాగే కొన్ని సన్నివేశాలు ఊహాజనితంగానే ఉన్నాయి. అలాగే చిన్న పిల్లలు పెద్ద వాళ్ళ నడుమ ఈ తరహా సినిమాలు సన్నివేశాలు చాలానే చూసి ఉంటాం. సో మరీ కొత్తదనం కోరుకునేవారికి రుచించకపోవచ్చు.

సాంకేతిక వర్గం:

ఈ లఘు చిత్రంలో ఈనాడు వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నీకల్ టీం వర్క్ కూడా బాగుంది. హర్ష సంగీతం మెయిన్ ఎసెట్ అని చెప్పొచ్చు. ఇంకా మౌర్య సినిమాటోగ్రఫీ బాగుంది. శివ ఎడిటింగ్ ఓకే.

ఇక దర్శకుడు శ్రీకాంత్ దేవరకొండ విషయానికి వస్తే.. తన వర్క్ ఈ ఎపిసోడ్ కి బాగుంది. కొన్ని మూమెంట్స్ లో రెగ్యులర్ అనిపిస్తుంది కానీ మిగతా అంతా తాను బాగా హ్యాండిల్ చేశారు. ముందు వచ్చిన ఎపిసోడ్స్ లో కొంచెం రిఫ్రెషింగ్ గా ఈ ఎపిసోడ్ అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ని ఇంకొంచెం బాగా డెవలప్ చేసి ఉంటే బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ లఘు చిత్రం ‘కాలింగ్ బెల్’. ఈటీవీ విన్ లో ఈ కథా సుధని ఫాలో అవుతున్నవారికి కొంచెం రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఈ తరహా కథనాలు ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. అలానే ఎంటర్టైనింగ్ గా అలానే ఎమోషనల్ పరంగా కూడా ఈ ఎపిసోడ్ డీసెంట్ గా అనిపిస్తుంది. చిన్న ఫ్లాస్ పక్కన పెడితే ఈటీవీ విన్ లో దీనిని కూడా ఫ్యామిలీతో ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు