ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న చిత్రాల్లో ‘వార్-2’ కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వారిద్దరు చేసే యుద్ధాన్ని మనకు వార్-2 రూపంలో దర్శకనిర్మాతలు చూపెట్టనున్నారు.
అయితే, ఈ సినిమా కోసం ఉత్తరాదిన ఎంతటి హైప్ ఉందో, దక్షిణాదిన కూడా అంతే అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో తమ అభిమాన హీరో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని వారు ఆశగా చూస్తున్నారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌ను గ్రాండ్ లెవెల్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో తెలుగులోనూ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు వారు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ చిత్ర తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో ఘనంగా నిర్వహిస్తారని.. దీని కోసం ఎన్టీఆర్ స్వయంగా బాధ్యతలు తీసుకున్నాడని.. ఇక ఈ ఈవెంట్ కోసం హృతిక్ రోషన్ కూడా వస్తాడని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఆగస్టు రెండో వారంలో నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.