‘విశ్వంభర’లో అదొక్కటే బ్యాలెన్స్..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ మూవీ రానుంది. ఇక గతంలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసినా, కొన్ని కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఆలస్యానికి కారణం ఏమిటనే విషయంపై సినీ సర్కిల్స్‌లో ఓ వార్త వినిపిస్తోంది.

విశ్వంభర చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని.. దీనికి సంబంధించిన ట్రాక్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఇప్పటికే రెడీ చేశారని తెలుస్తోంది. అయితే, ఇది మెగాస్టార్ చిరంజీవికి నచ్చలేదని.. అందుకే దీన్ని మార్చే పనిలో కీరవాణి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కంపోజిషన్ పూర్తి కాగానే ఈ పాటను షూట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఈ స్పెషల్ సాంగ్‌లో చిరుతో పాటు ఎవరు డ్యాన్స్ చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా జూలై 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version