అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ఇదేనా.. సోషల్ మీడియాలో వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేయగా ఇదొక సూపర్ హీరో మూవీగా తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

అయితే, ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ప్రేక్షకులు ఎంతో ఇష్టమైన ‘శక్తిమాన్’ అనే పవర్‌ఫుల్ సూపర్ హీరో టైటిల్ ఈ సినిమాకు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను కూడా మేకర్స్ ప్లాన్ చేశారట. త్వరలోనే ఈ భారీ అనౌన్స్‌మెంట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందట.

కాగా, ఇదే టైటిల్ స్పూర్తితో మలయాళ నటుడు కమ్ దర్శకుడు బాసిల్ జోసెఫ్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ రెండింట్లో ఏది నిజం అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపిక పదుకొనె ఓ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version