రామ్ సినిమాలో కన్నడ హీరో.. సెట్ అయ్యేనా..?

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉండనుందట. ఆ పాత్ర కోసం ఎవరైనా సీనియర్ హీరోను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. తొలుత ఈ పాత్రకు మోహన్ లాల్‌ని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించిందట. కానీ, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కన్నడ హీరో ఉపేంద్రతో చిత్ర యూనిట్ చర్చలు జరుపుతుందట.

ఇప్పటికే ఉపేంద్రకు కథను కూడా నెరేట్ చేశారట చిత్ర యూనిట్. మరి ఈ సినిమాలో నటించేందుకు ఆయన ఒప్పుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version