రాజాసాబ్ కోసం బాలీవుడ్ ‘స్పెషల్’ బ్యూటీ..?

రాజాసాబ్ కోసం బాలీవుడ్ ‘స్పెషల్’ బ్యూటీ..?

Published on Jul 1, 2025 12:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా హారర్ కామెడీ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుందని.. ఓ సాంగ్ షూటింగ్ మిగిలి ఉందని.. ఇదొక స్పెషల్ ఐటెం సాంగ్ అని తెలుస్తోంది. కాగా, ఈ ఐటెం సాంగ్‌లో ఏ హీరోయిన్ డ్యాన్స్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, తాజాగా ఈ స్పెషల్ నెంబర్ కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ని అప్రోచ్ అయ్యేందుకు మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పాటలో యాక్ట్ చేసేందుకు ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. దీంతో ‘రాజాసాబ్’ స్పెషల్ సాంగ్ కోసం కరీనా ఒప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు