న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పాత్రలో నాని నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ఇప్పటికే అనౌన్స్ చేశాడు.
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా, దానికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించబోతుందనే టాక్ జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇందులోని హీరోయిన్ పాత్రకు ఆమె అయితే బాగా సూట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట.
గతంలో నాని సరసన కృతి శెట్టి ‘శ్యామ్ సింఘ రాయ్’లో నటించింది. ఇక ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను 2026 మార్చి 26న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.