షూటింగ్ పూర్తవకుండానే SSMB29 ఓటీటీ పార్ట్నర్ లాక్..?

షూటింగ్ పూర్తవకుండానే SSMB29 ఓటీటీ పార్ట్నర్ లాక్..?

Published on Jul 3, 2025 2:00 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB29 ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త మేకోవర్‌తో ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

కానీ, ఈ సినిమా నుంచి అధికారికంగా ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా మేకర్స్ ఇవ్వలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ అత్యంత భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని.. ఈ సినిమాను పూర్తి అడ్వెంచర్ చిత్రంగా జక్కన్న రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు