ఆ హీరోతో మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన శ్రీలీల..?

ఆ హీరోతో మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన శ్రీలీల..?

Published on Nov 14, 2025 3:00 AM IST

Sreeleela

యంగ్ బ్యూటీ శ్రీలీల వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా, అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఇక ఆమె ప్రస్తుతం శివకార్తికేయన్ సరసన నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే, ఈ సినిమా రిలీజ్‌కు ముందే శ్రీలీల మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి సైన్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన నెక్స్ట్ చిత్రంలో కూడా ఆమె శివకార్తికేయన్‌తో మరోసారి జోడీ కట్టనుందట. దీంతో ఈ ఇద్దరినీ మరోసారి తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

సిబి చక్రవర్తి దర్శకత్వంలో రూపొందనున్న ఈ కొత్త సినిమా షూటింగ్‌ డిసెంబర్‌ 10న ప్రారంభం కానుంది. సిబి చక్రవర్తి-శివకార్తికేయన్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘డాన్‌’ పెద్ద హిట్‌ కావడంతో, ఈ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందా అనే విషయంపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు