పెద్ది : ‘చికిరి చికిరి’ లవ్ సాంగ్ కాదట!

పెద్ది : ‘చికిరి చికిరి’ లవ్ సాంగ్ కాదట!

Published on Nov 13, 2025 7:02 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చి బాబు సానా డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి రీసెంట్‌గా వచ్చిన తొలి సింగిల్‌ ‘చికిరి చికిరి’ సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన ఈ పెప్పీ నంబర్‌ చరణ్‌ ఎనర్జీ, స్టెప్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించారు.

అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలాజీ మాట్లాడుతూ.. ‘ఈ పాట ప్రేమ గురించి కాదు. బుచ్చి బాబు గారు చెప్పినట్లు, మొదట పెద్ది పాత్రకు హీరోయిన్‌పై ఉన్నది ప్రేమ కాదు, ఆకర్షణ. అందుకే ‘సరుకు సామాను’, ‘దీనక్క’, ‘సొంగకార్చుకొందే’ వంటి పదాలు వాడాం. పెద్ది రఫ్‌ అండ్‌ రస్టిక్‌ నేచర్‌ ఉన్న వ్యక్తి కాబట్టి, అతని భాషా రీతికి తగ్గట్టే లిరిక్స్‌ రాశాను” అని తెలిపారు.

ఈ భారీ ఎంటర్‌టైనర్‌లో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించగా, శివరాజ్‌కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మార్చి 27, 2026న గ్రాండ్‌గా విడుదల కానుంది.

తాజా వార్తలు