‘స్పిరిట్’ పట్టాలెక్కేది అప్పుడేనా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలను త్వరలోనే ముగించాలని ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత ప్రభాస్ తన నెక్స్ట్ చిత్రంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ అనే మూవీలో నటిస్తాడు.

ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా పూర్తి కాప్ డ్రామాగా తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో ఓ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ తన విధ్వంసాన్ని చూపెట్టనున్నాడు. అయితే, ఈ సినిమా కోసం ప్రభాస్ కొంత సమయం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ స్లిమ్ లుక్‌లోకి మారుతాడని.. అందుకే ఈ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని చిత్ర వర్గాల టాక్.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇండియాతో పాటు పలు దేశాల్లో చిత్రీకరించే అవకాశం ఉందట. అందుకే ఈ సినిమాలో కొరియన్, అమెరికన్ యాక్టర్స్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన స్పిరిట్ చిత్రం పూర్తయ్యేసరికి ఎంత సమయం పడుతుందనే విషయాన్ని ఇప్పట్లో అంచనా వేయడం కష్టమే అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Exit mobile version