తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’గా మన ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ కాకముందే, రజినీ ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రముఖ డైరెక్టర్ కమ్ యాక్టర్ శశికుమార్ ఇటీవల ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే, ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయన రజినీకాంత్ కోసం ఓ కథను రాసుకున్నాడట. ఈ కథను రజినీకి కొంతమేర వినిపించగా, తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఇప్పుడు రజినీ కోసం కథను పూర్తిగా రెడీ చేసి సినిమాను పట్టాలెక్కించాలని శశి కుమార్ ప్లాన్ చేస్తున్నాడు. కాగా, రజినీకాంత్ తన నెక్స్ట్ చిత్రం ‘జైలర్ 2’ని దర్శకుడు నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.