టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున రీసెంట్‌గా ‘కుబేర’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రలకు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ తరహా పాత్రలను చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు. ఇక ఆయన కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రం అయిన 100వ చిత్రాన్ని ఇప్పటికే ఓకే చేసినట్లు తెలుస్తోంది.
తమిళ దర్శకుడు కార్తీక్ చెప్పిన కథకు నాగ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుందట. ఇక ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా నాగ్ పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘అయోతి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్‌లో ఈ సినిమాలో శశికుమార్ లీడ్ రోల్‌లో నటించారు. ఇప్పుడు ఈ కథ విన్న నాగ్, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని ట్రిడెంట్ ఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమవుతోంది.
మరి తన నెక్స్ట్ రెండు సినిమాలను ఓకే చేసి నాగ్ తన అభిమానులకు అదిరిపోయే న్యూస్‌ను ఆయన పుట్టినరోజు కానుకగా అందిస్తాడా.. అనేది ఆగస్టు 29న తేలనుంది.