దర్శకత్వంలో తమ సత్తా చాటి తమకుంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే, వారిలో కొందరు మాత్రమే నటనపై మక్కువతో హీరోలుగా, యాక్టర్లుగా మారారు. అయితే, ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ కేవలం తమ పని మాత్రమే చేసుకుంటూ వెళుతున్నారు.
కాగా, ఓ తమిళ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు హీరోగా మారుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, ఆయన తాజాగా హీరోగా మారేందుకు రెడీ అవుతున్నాడు. తానే స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.