మరో డైరెక్టర్‌కు చిరు గ్రీన్ సిగ్నల్..?

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇప్పటికే ఆయన నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాతో పాటు కామెడీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిరు ఫిక్స్ అయ్యాడు.

అయితే, ఈ సినిమాల తర్వాత కూడా చిరు తన నెక్స్ట్ చిత్రాల లైనప్‌లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల, బాబీ లాంటి డైరెక్టర్స్‌తో సినిమా కమిట్ అయిన చిరు, ఇప్పుడు మరో డైరెక్టర్‌కు కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. దర్శకుడు వెంకీ కుడుముల చిరంజీవి కోసం ఓ హిలేరియస్ ఎంటర్‌టైనర్ కథను రెడీ చేశాడని.. ఈ కథను చిరుకి వినిపించగా, ఆయన కూడా ఆసక్తి చూపారని.. త్వరలోనే ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని సినీ సర్కిల్స్ టాక్.

దీన్ని బట్టి చూస్తే, చిరంజీవి ఈసారి ఆచితూచి అడుగులు వేయడమే కాకుండా మంచి స్క్రిప్ట్ సెలక్షన్ కూడా చేస్తున్నాడని చెప్పాలి.

Exit mobile version