రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న ఉండటంతో ఆయన అభిమానులు ఆ రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో రెబల్ ఫ్యాన్స్‌కు ప్యూర్ ర్యాంపేజ్ ఇచ్చేందుకు సలార్ సిద్ధమవుతున్నాడు.
ప్రభాస్ నటించిన ‘సలార్ : ది సీజ్‌ఫైర్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్ అల్ట్రా స్లిమ్ లుక్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లో సలారోడి దెబ్బ అదిరిందంటూ అభిమానులు పండగ చేసుకున్నారు.
ఇక ఇప్పుడు మరోసారి సింగిల్ స్క్రీన్స్‌ను తగలబెట్టేందుకు సలార్ రెడీ అవుతున్నాడు. అక్టోబర్ 23న తెలంగాణలోని బెస్ట్ సింగిల్ స్క్రీన్స్‌లో ‘సలార్’ స్పెషల్ మార్నింగ్ షోలు వేస్తున్నారు. మరి ఈసారి సలార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమాను హొంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.