‘ఫౌజీ’ బర్త్ డే ట్రీట్స్ రెడీ చేసిన ప్రభాస్..!

Fauji

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూసతున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఈ ట్రీట్ ఉండనుంది. కాగా, బర్త్ డే‌కి ఒక రోజు ముందుకు కూడా ఈ మూవీ నుంచి చిన్న సర్‌ప్రైజ్ ఉండనుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజ్‌ను అక్టోబర్ 22న ఉదయం 11.07 గంటలకు.. టైటిల్ పోస్టర్‌ను అక్టోబర్ 23న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దీంతో ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు. ఇక సోషల్ మీడియాలో గతకొంత కాలంగా ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పెడతారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఈ చిత్రానికి మేకర్స్ ఎలాంటి టైటిల్ పెడతారో తెలియాలంటే అధికారికంగా వెల్లడించే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version