తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘జైలర్’కు సీక్వెల్‌గా ‘జైలర్-2’ చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు నెల్సన్ దిలీప్ ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నాడు. ఇక ఈ సీక్వెల్ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే, ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కూడా నటిస్తుండగా.. టాలీవుడ్ నుంచి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్నాడనే వార్త బాగా వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఆయన చేయబోయే పాత్రపై కూడా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా పవర్ఫుల్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.
ఈ పాత్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ వార్తతో బాలయ్య ఫ్యాన్స్ జైలర్ 2 మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా.. తమ అభిమాన హీరోను పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తి కనబరుస్తున్నారు.