‘సలార్’ షూటింగ్ ప్లాన్స్ ఇలాగే ఉండబోతున్నాయా ?

‘సలార్’ షూటింగ్ ప్లాన్స్ ఇలాగే ఉండబోతున్నాయా ?

Published on Dec 23, 2020 3:00 AM IST

ప్రభాస్ సినిమా సినిమాకు తన పరిధిని పెంచుకుంటూ వెళ్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ చిత్రం చేస్తున్న ఆయన తర్వాతి సినిమాను ప్రసాన్త నీల్ దర్శకత్వంలో చేయనున్నారు. అదే ‘సలార్’. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించారు. ‘కెజిఎఫ్’తో ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తమైంది. త్వరలో పార్టీ రిలీజ్ కానుంది. వీరిద్దరి కాంబినేషన్ అనగానే విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. భారీ వ్యయంతో నిర్మితం కానున్న ఈ సినిమాను జనవరి చివరి వారంలో మొదలుపెట్టనున్నారు.

మొదటి నాలుగు నెలల్లో సగం చిత్రీకరణ ముగించి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చి మిగిలిన సగాన్ని ఇంకో మూడు నెలల్లో పూర్తిచేయాలనేది దర్శకుడి ఆలోచనట. అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైమ్ ఉంటుందని భావిస్తున్నారట. ఇక సినిమా దసరా లేదా 2022 సంక్రాతి కానుకగా రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ లాంటి ఇతర ముఖ్య భాషల్లో కూడ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం కాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ పాన్ ప్రాజెక్టును హోంబాలే సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్లో ‘ఆదిపురుష్’ ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నారు.

తాజా వార్తలు