స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డ తెరకెక్కిన లేటెస్ట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అల వైకుంఠపురములో”. ఈ చిత్రం బాక్సాఫీస్ పరంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందుకు తగ్గట్టుగానే ఆడియో పరంగా కూడా భారీ హిట్ ను నమోదు చేసుకుంది.
అల్లు అర్జున్ కెరీర్ లో ఉన్న కొన్ని మ్యూజికల్ చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ లో ఖచ్చితంగా అల వైకుంఠపురములో చిత్రం ఆల్బమ్ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం కానీ వారి రచయితలు ఇచ్చిన పాటలు కానీ ఒక్కొక్కటి ఒక్కో సెన్సేషన్ అయ్యాయి.
ఇక అన్నిటికన్నా ముఖ్యంగా అయితే “బుట్ట బొమ్మ” సాంగ్ నెలకొల్పిన సెన్సేషన్ రికార్డులు అన్ని ఇన్ని కాదు. రామజోగయ్య శాస్త్రి రూపకల్పన చేసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ తన గొంతుతో మైమరపించడంతో ఈ సాంగ్ సెన్సేషన్ ఇంకా కొనసాగుతుందని అర్మాన్ మాలిక్కే స్వయంగా తెలిపాడు.
మొత్తం మన ఇండియా లోనే టాప్ 100 సాంగ్స్ లో బుట్ట బొమ్మ 7వ స్థానంలో ట్రెండ్ అవుతున్నట్టు తెలిపి బుట్ట బొమ్మ హవా “ఇప్పటికీ ఆగదు ఎప్పటికీ ఆగదు” అన్నట్టుగా ట్వీట్ చేసాడు. మరి ఈ సాంగ్ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
Can’t stop won’t stop ???????????? #ButtaBomma @YouTubeMusic pic.twitter.com/Mru34mSdrz
— ARMAAN MALIK (@ArmaanMalik22) August 25, 2020