డిసెంబర్ అంతా బిజీబిజీగా సమంత

Samantha_Prabhu
క్రిస్మస్ పలకరింపులతో కొత్త సంవత్సరం తుళ్ళింతలతో, రాబోయే సంక్రాంతి రంగవల్లులతో డిసెంబర్ నెల చాలా సరదాగా గడిచిపోతుంది. కాకపోతే ఈ డిసెంబర్ అంతా అందాల నటి సమంతకు క్షణంకూడా తీరికలేకుండా వుంది

ఈ టాలెంటెడ్ నటికి ఈ డిసెంబర్ అంతా షూటింగ్ లతో గడవనుంది. “రానున్న డిసెంబర్ అద్భుతంగా వుండనుంది. క్రిస్మస్ లేదు.. న్యూ ఇయర్ లేదు.. కేవలం పని మాత్రమే” అని ట్వీట్ ఇచ్చింది

ప్రస్తుతం ఈ భామ తెలుగులో అక్కినేని మల్టీ స్టారర్ ‘మనం’, చైతు సరసన ‘ఆటోనగర్ సూర్య’, బెల్లంకొండ శ్రీనివాస్ – వి.వి వినాయక్ ల సినిమా, ఎన్.టీ.ఆర్ తో ఒక సినిమాలో నటిస్తుంది. తమిళంలో సూర్య సరసన మరియు లింగుస్వామి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తుంది

Exit mobile version