ఇద్దరమ్మాయిలతో టీంతో బన్ని చివరి రోజు.!

Iddarammayilatho-Audio-Post
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ కి ఈ రోజుతో ముగింపు పలకనున్నాడు. బన్ని, అలాగే హీరోయిన్స్ కేథరిన్, అమలా పాల్ లకు ఈ రోజే షూటింగ్ చివరి రోజు. మిగతా నటీనటులతో, కమెడియన్స్ పై తీయాల్సిన కొన్ని సీన్స్ ని మరికొద్ది రోజుల్లో ఫినిష్ చేయనున్నారు. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా మే 23న విడుదల కావడానికి సిద్దమవుతోంది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కి మంచి ఆదరణ లబిస్తోంది. బ్రహ్మానందం, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు.

Exit mobile version